ఎలమంచిలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న "ఎన్టీఆర్ భరోసా" పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం ఎలమంచిలి టౌన్ పరిధిలోని తులసి నగర్ మరియు ఎన్టీఆర్ కాలనీలలో వార్డ్ 7,8,9 లలో ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APRDC) చైర్మన్, ఎలమంచిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ శ్రీ ప్రగడ నాగేశ్వరరావు గారు పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా ఆయన లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి, వారి సంక్షేమాన్ని అడిగి తెలుసుకుంటూ తన సొంత చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు.పేదలు, వృద్ధులు, వికలాంగులు మరియు వితంతువుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, నెలాఖరు రాకముందే ప్రతీ నెల 1వ తేదీన ఇంటికే పెన్షన్ అందించడం శుభపరిణామమని తెలిపారు.త్వరలోనే కొత్త పెన్షన్లు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. అర్హత ఉన్న ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అలాగే మొన్న జరిగిన స్కూల్ గర్ల్స్ హై స్కూల్ కమిటీ ఎలక్షన్స్ లో మన పార్టీకి చెందిన పల్ల లలిత చైర్మన్ గారు ఎన్నికైన సందర్భంగా లలిత గారును అభినందించారు.స్థానికులు కోరిన పలు మౌలిక వసతుల సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ, సమస్యల పరిష్కారానికి వెంటనే అధికారులతో మాట్లాడి చర్యలు చేపడతామని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎలమంచిలి టౌన్ ప్రధాన కార్యదర్శి ఆడారి ఆదిమూర్తి, టౌన్ ఎక్స్టీడీపీ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కొటారు సాంబ, అధికార ప్రతినిధి దాడి రమేష్, ఆడారి రమణబాబు, క్లస్టర్ ఇన్చార్జిలు బొద్దపు శ్రీనివాసరావు& ఆడారి సన్యాసినాయుడు, దాంట్ల వెంకటస్వామి, టౌన్ తెలుగుత అధ్యక్షులు నమ్మి రమణ మరియు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు, వార్డు సచివాలయ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు. తమ వద్దకే వచ్చి పెన్షన్లు అందజేసి, కొత్త పెన్షన్ల పై హామీ ఇచ్చినందుకు స్థానిక ప్రజలు ప్రగడ నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలిపారు.