మట్టి గణపతులనే పూజిద్దాం: బొత్స సందీప్, బెల్లాని వంశీకృష్ణ..

మట్టి గణపతులనే పూజిద్దాం: బొత్స సందీప్, బెల్లాని వంశీకృష్ణ..

13/September/2026 19:46    Share:   

విజయనగరం: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని వైసీపీ నాయకులు బొత్స సందీప్, బెల్లాని వంశీకృష్ణ పిలుపునిచ్చారు. వారి ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ జంక్షన్ వద్ద మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా బొత్స సందీప్, బెల్లాని వంశీకృష్ణ మాట్లాడుతూ మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపారు. రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాల వల్ల నీటి కాలుష్యం ఏర్పడే అవకాశం ఉందని, అందువల్ల ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు.
పట్టణంలోని వైసీపీ నాయకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.
విజయనగరం జిల్లా ఇంచార్జ్ మందపాటి సూర్యనారాయణ రాజు
Breaking News

Subscribe our Newsletter