8వ తేదీన భవన నిర్మాణ కార్మికుల చలో కలెక్టరేట్ జయప్రదం చేయండి,సిఐటియు

8వ తేదీన భవన నిర్మాణ కార్మికుల చలో కలెక్టరేట్ జయప్రదం చేయండి,సిఐటియు

01/October/2026 19:25    Share:   

అచ్చుతాపురం

భవన నిర్మాణ కార్మికులకు ప్రమాద బీమా 10 లక్షలు ఇవ్వాలని భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో కొత్త కార్మికుల నమోదు ,పాత వారికి రెన్యువల్స్ తదితర సమస్యలు పరిష్కరించాలని హరిపాలెం, దోసూరు, అచ్చుతాపురంలో భవన నిర్మాణ కార్మికుల సమావేసాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చందక రామకృష్ణ, సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ రాము, మండల కన్వీనర్ కే సోమనాయుడు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో కార్మికుల సొమ్ము 4500 కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ ఆ డబ్బులు కార్మిక సంక్షేమానికి ఖర్చు చేయడం లేదని ప్రమాదవశాత్తు చనిపోయిన కార్మికులకు 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, ప్రమాదంలో అంగవైకల్యం పాలైన కార్మికులకు సహాయం అందించాలని గతంలో ఉన్న సంక్షేమ పథకాలు పునరుద్ధరణ చేయాలని భవన నిర్మాణ కార్మికులకు ఈఎస్ఐ ,పిఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలని ఈ నెల 8వ తేదీన కలెక్టర్ జరిగే మహాధర్నాన్ని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం అచ్చుతాపురం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు కార్డులు పంపిణీ చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో శ్రీ మణికంఠ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు రాజన అప్పలనాయుడు ,దోసూరు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు రమేషు ,రాజు తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter