విజయనగరం పైడితల్లి శిరిమానోత్సవాలకు ముందస్తు ఏర్పాట్లు

విజయనగరం పైడితల్లి శిరిమానోత్సవాలకు ముందస్తు ఏర్పాట్లు

26/September/2026 20:12    Share:   

-ఏర్పాట్లపై అధికారులతో ఎంపీ కాళిశెట్టి సమీక్ష
విజయనగరం, సెప్టెంబర్ 26:

విజయనగరం ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి శిరిమానోత్సవాలను అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని విజయనగరం ఎంపీ కాళిశెట్టి అప్పలనాయుడు సూచించారు.జిల్లా కలెక్టర్ ఎస్. రామసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో శిరిమానోత్సవాల నిర్వహణపై జరిగిన సమన్వయ సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు. అక్టోబర్ 25 నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు, భక్తుల రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, భద్రత, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలపై అధికారులతో సమీక్షించారు.రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు పటిష్ఠంగా చేపట్టాలని ఎంపీ సూచించారు. శిరిమాను ఊరేగింపు జరిగే మార్గాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయడంతో పాటు భక్తులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలని అధికారులను కోరారు.పైడితల్లి అమ్మవారి శిరిమానోత్సవాలు విజయనగరం ప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని ఎంపీ కాళిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. ఉత్సవాల విజయవంతానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉత్సవ కమిటీలు, ప్రజలు సమిష్టిగా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. భక్తుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కోరారు.

క్రైమ్ అనాలసిస్ విజయనగరం జిల్లా ఇంచార్జ్
మందపాటి సూర్యనారాయణ రాజు
Breaking News

Subscribe our Newsletter