
రాంబిల్లి మండలం పెద్ద కలవలపల్లి, వెల్చూర్ గ్రామాల్లో వ్యవసాయ అధికారి శ్రీ సుమంత గారు ఆధ్వర్యంలో "పొలం పిలుస్తుంది" కార్యక్రమం జరిగింది.ముందుగా క్షేత్ర పర్యటన చేసి రైతులకు వారు పండిస్తున్న పంటలపై సలహాలు అందించారు. ఈ సందర్భంగా రైతులు PMDS ప్లాట్లలో ప్రకృతి వ్యవసాయం పద్ధతులు పరిశీలించారు. ఎలమంచిలి మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ శ్రీమతి లవ కుమారి గారు రైతులతో కలిసి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.ఆమె మాట్లాడుతూ, సేంద్రియ వ్యవసాయం ద్వారా భూమి ఆరోగ్యం, మానవ ఆరోగ్యం కాపాడుకోవచ్చని తెలిపారు. రైతులు క్రమం తప్పకుండా ఆదాయం వచ్చేలా తక్కువ విస్తీర్ణంలోనే పంటల ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్‌లో రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు అన్నీ మండలంలోని రైతు భరోసా కేంద్రాల్లో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కావలసిన వారు రైతు సేవా కేంద్రాలను సందర్శించాలని కోరారు. అలాగే వరి తప్ప మిగతా పంటలకు పంట బీమా చేసుకోవాలని రైతులకు సూచించారు.ఈ నెల 31 వ తారీకు ఆఖరి తేదీ కాబట్టి అందరూ కూడా పంటల భీమా క్రాఫ్ట్ చేసుకోవాలని తెలిపారు వరికు మాత్రం వచ్చే నెల 15వ తేదీ ఆఖరి తేదీగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎలమంచిలి మార్కెట్ కమిటీ చైర్మన్ రవి కుమార్ గారు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మహేష్ శ్రీను ప్రసన్న గ్రామ వ్యవసాయ సహాయకులు కోటేశ్వరరావు అనూష ఏఈఓ దేవుడు పాల్గొన్నారు