డైట్  లో డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం 11వ వర్ధంతి  ఘన నివాళులు

డైట్  లో డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం 11వ వర్ధంతి  ఘన నివాళులు

27/July/2026 20:22    Share:   

అనకాపల్లి దాడి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ – అటానమస్,  ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త, "మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా" డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం గారి 11వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నిర్వహించారు
ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఉన్న డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం విగ్రహానికి కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ గారు  పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాల మౌనం పాటించి ఆయన దేశానికి అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ శ్రీ దాడి రత్నాకర్ గారు మాట్లాడుతూ, "డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం గారు యువతకు ఆదర్శప్రాయమైన మహనీయులు. వారి నిరాడంబర జీవితం, క్రమశిక్షణ, దేశాభివృద్ధిపై ఉన్న అంకితభావం ప్రతి విద్యార్థికి స్ఫూర్తిదాయకం. కలలు కనడమే కాదు, వాటిని సాకారం చేసుకునే దిశగా కృషి చేయాలని కలాం గారు యువతకు ఇచ్చిన సందేశం ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తుంది. విద్యార్థులు ఆయన ఆశయాలను ఆచరిస్తూ సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలి" అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల  ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఏ కిరణ్ కుమార్, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొని డా. కలాం గారికి ఘన నివాళులు అర్పించారు.
Breaking News

Subscribe our Newsletter