ఏలూరు మంచినీటి చెరువు పరిస్థితిపై వైసీపీ నేతల ఆవేదన..

ఏలూరు మంచినీటి చెరువు పరిస్థితిపై వైసీపీ నేతల ఆవేదన..

25/July/2026 18:47    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు.

ఏలూరు, జులై 25:
ఏలూరు నగరానికి ప్రధాన మంచినీటి వనరైన 100 ఎకరాల చెరువు వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నేడు పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జి మామిళ్ళపల్లి జయప్రకాష్ (JP) మాట్లాడుతూ, నగరపాలక సంస్థ కమిషనర్ మరియు కూటమి ప్రభుత్వం మంచినీటి చెరువును ప్రజల సమస్యలు తీర్చడానికి కాకుండా తమ అవినీతి దాహం తీర్చుకోవడానికి వాడుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.ఏలూరు నగర ప్రజలకు రెండుపూటల మంచినీటి సరఫరా కష్టతరమని కమిషనర్ మీడియాలో వ్యాఖ్యానించిన నేపథ్యంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి మామిళ్ళపల్లి జయప్రకాష్ (JP) గారు నేడు ప్రధాన మంచినీటి చెరువును పరిశీలించారు.

చెరువు వద్ద అవాక్కయిన నేతలు

100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ మంచినీటి చెరువు వద్ద కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నాయకులతో కలిసి తనిఖీ చేసిన JP, ప్రస్తుత పరిస్థితిని చూసి తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా కోట్లల్లో ఖర్చు చేసినా ఫలితం శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు.

గత 15 ఏళ్లుగా ఎద్దడి లేదు

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఏలూరు నగరానికి మంచినీటి కోసం 100 ఎకరాల్లో ఈ చెరువును ఏర్పాటు చేశారు. గత 15 సంవత్సరాలుగా ఎంతటి ఎండలు వచ్చినా ఏలూరుకు మంచినీటి ఎద్దడి లేకుండా ఈ చెరువు ఉపకరించింది.

కూటమి ప్రభుత్వంలో పరిస్థితి మార్పు

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని నేతలు ఆరోపించారు. గత రెండు సంవత్సరాల్లో మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో మంచినీటి కోసం కోట్ల రూపాయల ఖర్చు చేసినట్లు చూపించారు. నీరు లిఫ్ట్ చేయడానికి మోటార్లను అద్దెకు తీసుకువచ్చి, తర్వాత కొనుగోలు చేసినట్లు, కోట్లలో బిల్లులు పెట్టినట్లు తెలిపారు.

అధికారుల వైఖరిపై ప్రశ్నలు

నగరపాలక కమిషనర్, మేయర్, ఎమ్మెల్యే, అధికార పార్టీ కార్పొరేటర్లు నిరంతరం పంపులు, చెరువు చుట్టూ తిరుగుతూ ప్రజల మంచినీటి కష్టాలు తీర్చడం కోసం శ్రమిస్తున్నామని చెప్పుకుంటున్నా, నేటి చెరువు పరిస్థితి దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నట్లు వైసీపీ నేతలు ఆరోపించారు.నగరపాలక సంస్థ కమిషనర్, కూటమి ప్రభుత్వం ఈ మంచినీటి చెరువుని వీళ్ళ అవినీతి దాహం తీర్చుకోవడానికి వాడుకున్నారు తప్ప నిధులను ప్రజల కోసం సరిగా ఉపయోగించలేదు. వీళ్లు సరైన సమయంలో సరిగా చేసి ఉంటే ఈరోజు నగరానికి పరిస్థితి వచ్చేది కాదు.మీ కూటమి ప్రభుత్వంలో పరిపాలన ఏ విధంగా అయింది అంటే మేము కోట్లలో ఖర్చులు పెడుతున్నాము అంటారు వివరాలు ఎవరికీ చెప్పరు. నగరపాలక సంస్థ కమిషనర్ ను సమాచార హక్కు చట్టం ద్వారా ఖర్చులు వివరాలు అడిగితే ఒక్క వివరము సరిగా ఇవ్వడు ఎందుకంటే వీళ్ళ అవినీతి ఆ స్థాయిలో ఉంది.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ల ఏదైనా విషయం మీద ఆయనన్నీ సంప్రదిస్తే  కనీస సమాధానం చెప్పడు. ఈయన మున్సిపల్ కమిషనర్ లాగా కాదు కూటమికి కమిషన్లు అందించే వ్యక్తి మాదిరి తయారయ్యాడు అవినీతిలో ఏలూరు ని రాష్ట్రంలో నెంబర్ వన్ ప్లేస్ కి తీసుకువెళ్లారు అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు గుడిదేశీ శ్రీనివాస్ గారు, నుకపెయ్యి సుధీర్ బాబు గారు, నేరుసు చిరంజీవి గారు, దాసరి రమేష్ గారు,మున్నుల జాన్ గుర్నాథ్ గారు, కిలాడీ దుర్గారావు గారు, లంకలపల్లి గణేష్ గారు, గంట మోహన్ రావు గారు,జుజ్జువరపు విజయ నిర్మల గారు, ఇనపనూరీ జగదీష్ గారు, ఇమ్మనుయేలు జైకర్ గారు, భాస్కర్ల బాచి గారు, సాసుపల్లి యుగంధర్ గారు, సాయి ప్రదీప్ గారు , బండ్లమూడి సునీల్ గారు , సాయి గారు , ఎచ్చర్ల ఉమామహేశ్వర రావు గారు,పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

నిధుల దుర్వినియోగంపై సీరియస్ ఆరోపణలు

గత రెండేళ్లలో మంచినీటి కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు చెప్పుకుంటున్నా, సరైన సమయంలో సరిగా నిధులు వినియోగించి ఉంటే ఈరోజు నగరానికి ఈ దుస్థితి వచ్చేది కాదని JP అన్నారు. "కోట్లలో ఖర్చులు పెడుతున్నామంటారు కానీ వివరాలు ఎవరికీ చెప్పరు" అని ఆయన విమర్శించారు.

సమాచార హక్కు చట్టాన్ని కూడా లెక్కచేయడం లేదు

నగరపాలక సంస్థ కమిషనర్ ను సమాచార హక్కు చట్టం ద్వారా ఖర్చుల వివరాలు అడిగితే ఒక్క వివరం కూడా సరిగా ఇవ్వడం లేదని నేతలు ఆరోపించారు. వీరి అవినీతి ఎంత స్థాయిలో ఉందంటే ఎవరికీ సమాచారం అందనంతగా ఉందని వారు విమర్శించారు.

ప్రతిపక్ష కార్పొరేటర్లను నిర్లక్ష్యం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఏదైనా విషయం మీద కమిషనర్ ను సంప్రదిస్తే కనీస సమాధానం కూడా చెప్పడం లేదని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. "ఈయన మున్సిపల్ కమిషనర్ లాగా కాదు, కూటమికి కమిషన్లు అందించే వ్యక్తి మాదిరి తయారయ్యారు" అని JP విమర్శించారు. 

Breaking News

Subscribe our Newsletter