మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు: ఘనంగా నివాళులర్పించిన జిల్లా అదనపు ఎస్పీ 

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు: ఘనంగా నివాళులర్పించిన జిల్లా అదనపు ఎస్పీ 

04/July/2026 22:35    Share:   

అనకాపల్లి,
మన్యం వీరుడు, విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి వేడుకలను అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు.. జిల్లా అదనపు ఎస్పీ  శ్రీ ఎల్.మోహనరావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి వినమ్రంగా ఘన నివాళులర్పించారు.​ఈ సందర్భంగా అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహనరావు మాట్లాడుతూ:"బ్రిటిష్ వలస పాలకుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, మన్యం ప్రజల హక్కుల కోసం అల్లూరి సీతారామరాజు చేసిన సాయుధ పోరాటం భారత స్వాతంత్ర్య చరిత్రలోనే ఒక అద్భుత అధ్యాయం. ఆయన జయంతి తెలుగు ప్రజలకే కాకుండా యావత్ దేశానికే గర్వకారణం. బ్రిటిష్ అధికారుల దమనకాండను, దౌర్జన్య విధానాలను ఎదురిస్తూ, గిరిజనుల హక్కుల రక్షణ కోసం తన ప్రాణాలను అర్పించిన మహానీయుడు అల్లూరి." అని కొనియాడారు.​అలాగే, "1924 మే 7న విశాఖపట్నం జిల్లా మంప గ్రామం వద్ద బ్రిటిష్ తూటాలకు బలై, చివరి శ్వాస వరకు ప్రజా హక్కుల కోసమే పోరాడిన అల్లూరి సీతారామరాజు త్యాగం భారత చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది" అని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను, దేశభక్తిని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని అదనపు ఎస్పీ పిలుపునిచ్చారు.​ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీతో పాటు ఇన్‌స్పెక్టర్లు లక్ష్మి, శ్రీనివాసరావు, పిల్లా రమేష్, సూరి నాయుడు, ఎస్సైలు ప్రసాద్, సురేష్ బాబు, అంజిబాబు, ఆఫీస్ సూపరింటెండెంట్ ప్రతాప్ శేషయ్య మరియు కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని అల్లూరి అమరత్వానికి జోహార్లు అర్పించారు.
Breaking News

Subscribe our Newsletter