కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు: #ఏలూరు కలెక్టరేట్ లో ప్లాస్టిక్ నియంత్రణ విజయవంతం. #ఇండియన్ రిజిస్టర్ క్వాలిటీ సిస్టమ్స్ ధృవీకరణ. ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో ప్లాస్టిక్ వినియోగం నియంత్రణ ను విజయవంతంగా అమలు చేసినందుకుగాను ఇండియన్ రిజిస్టర్ క్వాలిటీ సిస్టమ్స్ ధ్రువీకరణ పత్రాన్ని అందజేసింది. ఈ మేరకు కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో సోమవారం ఇండియన్ రిజిస్టర్ క్వాలిటీ సిస్టమ్స్ సంస్థ ప్రతినిధి టి.ఎస్. అనంత్ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఇండియన్ రిజిస్టర్ క్వాలిటీ సిస్టమ్స్ కలెక్టరేట్ లో ప్లాస్టిక్ వినియోగం నియంత్రణ, స్థిరమైన ప్లాస్టిక్ నిర్వహణ, రీసైక్లింగ్ విధానం, తదితర అంశాలను పరిశీలించి, సంతృప్తి చెందిన అనంతరం ఇండియన్ రిజిస్టర్ క్వాలిటీ సిస్టమ్స్ సంస్థ జిల్లా కలెక్టరేట్ కి ధ్రువీకరణ జారీ చేసింది.డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు,పాల్గొన్నారు.