ఎన్నికల  నేపథ్యంలో ఎస్‌ఎస్‌టీ చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీలు

ఎన్నికల నేపథ్యంలో ఎస్‌ఎస్‌టీ చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీలు

24/October/2026 18:43    Share:   

CA న్యూస్ రిపోర్టర్ ఆనంద్ 
యలమంచిలి :స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శనివారం పులపర్తి జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్‌టీ చెక్‌పోస్టు వద్ద యలమంచిలి రూరల్ ఎస్‌ఐ ఉపేంద్ర ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా జరిగేలా పోలీసు అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అటుగా రాకపోకలు సాగించే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా నగదు, మద్యం, ఇతర ప్రలోభపరిచే వస్తువుల అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు చేపట్టారు. ఎన్నికల సమయంలో ప్రజలు శాంతియుతంగా వ్యవహరించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకూడదని పోలీసులు సూచించారు. వాహనదారులు తనిఖీలకు సహకరించాలని, ప్రయాణ సమయంలో అవసరమైన పత్రాలను వెంట ఉంచుకోవాలని తెలిపారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
Breaking News

Subscribe our Newsletter