చిన్నారుల మృతి పట్ల రామ్ మల్లిక్ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి విజయనగరం, సెప్టెంబర్ 30:
మెరకముడిదాం మండలంలో ఇటీవల చోటుచేసుకున్న విషాద ఘటనలో మృతి చెందిన చిన్నారుల కుటుంబాలను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు బుధవారం పరామర్శించారు. మందల గ్రామానికి చెందిన 5వ తరగతి విద్యార్థి నరేష్ చంద్రశేఖర్,4వ తరగతి విద్యార్థి శంకరపు వెంకటేష్‌కు చిన్నారులు మృతి చెందడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.బాధిత కుటుంబ సభ్యులను కలిసి వారి పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు. చిన్నారుల మృతి కుటుంబాలకు తీరని లోటని, ఈ కష్ట సమయంలో వారికి అండగా ఉంటామని రామ్ మల్లిక్ నాయుడు భరోసా ఇచ్చారు.చిన్నారుల మృతికి దారితీసిన పరిస్థితులపై సంబంధిత అధికారులు సమగ్రంగా పరిశీలించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
క్రైమ్ ఎనాలిసిస్ విజయనగరం జిల్లా ఇంచార్జ్ మందపాటి సూర్యనారాయణ రాజు