యువత భవిష్యత్తే రాష్ట్ర అభివృద్ధికి బలం ఎంపీ కలిశెట్టి..

యువత భవిష్యత్తే రాష్ట్ర అభివృద్ధికి బలం ఎంపీ కలిశెట్టి..

29/September/2026 20:27    Share:   

గరివిడి:
యువత భవిష్యత్తే రాష్ట్ర అభివృద్ధికి ప్రధాన బలమని విజయనగరం పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. మంగళవారం గరివిడిలోని అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులతో రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్ మల్లిక్ నాయుడుతో కలిసి ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్ లక్ష్యాలపై ఎంపీ చర్చించారు. మెగా డీఎస్సీ, పోలీస్ నియామకాలు, జాబ్ క్యాలెండర్ తదితర అంశాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్న విధానాలను వివరించారు.
రాష్ట్రంలో కొత్త పెట్టుబడులు, ఐటీ రంగ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. విశాఖను డేటా హబ్‌గా అభివృద్ధి చేయడం, గూగుల్ డేటా సెంటర్, కాగ్నిజెంట్ వంటి సంస్థల రాకతో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయని పేర్కొన్నారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా మారడంతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దోహదపడుతుందని చెప్పారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, మంత్రి నారా లోకేష్ చొరవతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాల విస్తరణకు కృషి జరుగుతోందన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని, విద్యార్థులకు పిలుపునిచ్చారు.

క్రైమ్ ఎనాలసిస్ విజయనగరం జిల్లా ఇంచార్జ్
మందపాటి సూర్యనారాయణ ర�
Breaking News

Subscribe our Newsletter