విజయవాడ:
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని మాజీ మంత్రి, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేదపండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేయగా, తీర్థప్రసాదాలను స్వీకరించారు.ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ప్రార్థించారు. చీపురుపల్లి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నంబర్‌వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని కళా వెంకటరావు తెలిపారు.నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేసి, ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. యువనేత, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు, పరిశ్రమలు తరలివచ్చి యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభించాలని ఆకాంక్షించారు.రాష్ట్రంతో పాటు చీపురుపల్లి నియోజకవర్గం సర్వతోముఖ అభివృద్ధి సాధించాలని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ప్రార్థించినట్లు కళా వెంకటరావు తెలిపారు.
క్రైమ్ అనాలసిస్ చీపురుపల్లి రిపోర్టర్ ఎస్ ఏ ఎన్ రాజు