కిడ్నీ బాధితుడి ఇంటికే ఎమ్మెల్యే!

కిడ్నీ బాధితుడి ఇంటికే ఎమ్మెల్యే!

28/September/2026 20:04    Share:   

రూ.7 లక్షల సీఎంఆర్‌ఎఫ్ సాయం అందజేత.. కుటుంబానికి భరోసా
 
క్రైమ్ అనాలిసిస్ రిపోర్టర్ ఆనంద్
 
రాంబిల్లి: కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఇటీవల ఆపరేషన్ చేయించుకున్న గోవిందపాలెం గ్రామ పౌరోహితులు చిట్టా వర్జుల సూరి ప్రకాష్ రావు కుటుంబానికి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అండగా నిలిచారు. ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.7 లక్షల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే స్వయంగా బాధితుడి ఇంటికి వెళ్లి అందించారు.
 
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి ధైర్యం చెబుతూ, కష్టకాలంలో అండగా ఉంటానని భరోసా కల్పించారు. ప్రజా సమస్యలను తెలుసుకుని, ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా బాధితులకు సహాయం అందేలా చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
 
ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయాన్ని చేరువ చేయడం ద్వారా ప్రజలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ సాయం అందించినట్లు పేర్కొన్నారు.
 
కార్యక్రమంలో మండల పార్టీ మాజీ అధ్యక్షులు వసంతవాడ దిన్ బాబు, అనకాపల్లి జిల్లా పురోహితుల సంఘం అధ్యక్షులు పెద్దింటి సూర్యనారాయణమూర్తి, టీడీపీ ఎస్సీ జడ్ నాయకులు సిహెచ్. ప్రసాదరావు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter