విజయనగరం, సెప్టెంబర్ 28:
విజయనగరం పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థులతో సమావేశమై వారి భవిష్యత్తు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. విజయనగరం నియోజకవర్గ టీడీపీ ముఖ్య నాయకులతో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న ఉద్యోగ అవకాశాలపై చర్చించారు.మెగా డీఎస్సీ, పోలీస్ నియామకాలు, జాబ్ క్యాలెండర్‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ఎంపీ వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, ఐటీ సంస్థలు వస్తుండటంతో యువతకు కొత్త ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు.భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక కేంద్రంగా మారనుందని, దీనివల్ల వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం, పెట్టుబడుల ఆకర్షణ ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో యువత కీలక భాగస్వాములు కావాలని ఎంపీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత తమ ప్రతిభను వినియోగించుకోవాలని సూచించారు.
క్రైమ్ ఎనాలసిస్ విజయనగరం జిల్లా ఇంచార్జ్ మందపాటి