మద్యం దుకాణాల రెన్యువల్‌పై అభ్యంతరాలు తెలియజేయాలి..

మద్యం దుకాణాల రెన్యువల్‌పై అభ్యంతరాలు తెలియజేయాలి..

27/September/2026 19:42    Share:   

చీపురుపల్లి:
చీపురుపల్లి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని మద్యం దుకాణాల రెన్యువల్‌కు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు, సందేహాలు ఉంటే తమకు తెలియజేయాలని చీపురుపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ సీఐ చక్రవర్తి కోరారు. గురువారం ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
చీపురుపల్లి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం మూడు మండలాల్లో మొత్తం 19 మద్యం దుకాణాలకు రెన్యువల్ చేసుకునేందుకు అవకాశం కల్పించగా, ఇప్పటివరకు 9 దుకాణాలు మాత్రమే రెన్యువల్ చేసుకున్నట్లు సీఐ తెలిపారు.
రెన్యువల్ చేసుకోని మిగిలిన 10 మద్యం దుకాణాలకు కొత్తగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. వీటిలో చీపురుపల్లి మండలంలో 4, గరివిడి మండలంలో 4, మెరకముడిదాం మండలంలో 2 దుకాణాలు ఉన్నాయని తెలిపారు. దుకాణాల రెన్యువల్, కొత్త దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా అభ్యంతరాలు ఉంటే చీపురుపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ అధికారులను సంప్రదించాలని సీఐ చక్రవర్తి కోరారు.

క్రైమ్ ఎనాలసిస్ విజయనగరం జిల్లా ఇంచార్జ్
మందపాటి సూర్యనారాయణ రాజు
Breaking News

Subscribe our Newsletter