యలమంచిలిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు

యలమంచిలిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు

27/September/2026 16:41    Share:   

యలమంచిలిలో వినాయక చవితి వేడుకలు: గణపతి నామస్మరణతో మార్మోగిన పురవీధులు
యలమంచిలి:

యలమంచిలి పట్నంలో ఉళ్ళక్క పేట రంగా వారి వీధి వినాయకుడుశనివారం నాడు అనుపు మహోత్సవం అతి వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా లడ్డు వేలంపేట 5300. కి ఆడారి సన్యాసినాయుడు దక్కించుకున్నారు. లక్కీ డ్రా 5 గ్రాముల వెండి నానెం, అనేక విశేష బహుమతులు లక్కి డిప్ ద్వారా అందించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పైడ్రాజు, రూపేష్, ఉదయ్ ,హేమంత్ నాయుడు, సంపత్, శివ సాయి, కుష్వంత్ ,శరత్ చంద్ర ,మౌళి, తెజెష్, వెంకటేష్, శ్రీనివాస్ ,భార్గవ్, లిఖితనందిని, భాగ్యశ్రీ, శ్రీహిత,భవిత భక్తులు పాల్గొన్నారు.
 
పర్యావరణహిత మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత
ఈ ఏడాది పట్టణంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ అత్యధిక ప్రాంతాల్లో మట్టి వినాయక ప్రతిమలను కొలువుదీర్చడం విశేషం. పలు స్వచ్ఛంద సంస్థలు, యూత్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో స్థానిక కాలనీల్లో ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన భారీ విగ్రహాలు, విభిన్న రూపాల్లో కొలువైన విఘ్నేశ్వరుడు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నారు.
భక్తిశ్రద్ధలతో విశేష పూజలు
పట్టణంలోని ప్రధాన వీధుల్లో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య గణపతి హోమాలు, ప్రత్యేక అభిషేకాలు, విశేష అర్చనలు నిర్వహించారు. భక్తులు స్వామివారికి ఇష్టమైన 21 రకాల పత్రి, ఉండ్రాళ్లు, కుడుములు, మోదకాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా తరలివచ్చిన భక్తులు 
పటిష్ట భద్రతా ఏర్పాట్లు
ఉత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణతో పాటు నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. సౌండ్ సిస్టమ్స్, డీజేల వినియోగంపై నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని అధికారులు సూచించారు. నవరాత్రుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానాలు నిర్వహించేందుకు ఉత్సవ నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
Breaking News

Subscribe our Newsletter