హరిపాలెం హరి గిరి పై శ్రీ విజయ దుర్గ అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు, 

హరిపాలెం హరి గిరి పై శ్రీ విజయ దుర్గ అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు, 

31/July/2026 16:53    Share:   

యలమంచిలి/హరిపాలెం,  స్థానిక గ్రామ దేవాలయంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని అమ్మవారికి శాకాంబరీ దేవి అవతారంలో ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.ఈ సందర్భంగా గ్రామంలోని ఏఎన్ఆర్జీఎస్ వర్కర్లందరూ కలిసి అమ్మవారి అలంకరణకు అవసరమైన పూజా సామాగ్రిని సమర్పించారు. ఆలయ పురోహితుడు కుక్కర వెంకటేష్ శర్మ చేతుల మీదుగా అమ్మవారికి అలంకరణ చేశారు.తెల్లవారుజామునుండే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు మాట్లాడుతూ, ఆషాఢ మాసంలో ఈ శుక్రవారం పళ్లు, పూలు, కాయకూరలు, ఆకుకూరలతో అమ్మవారిని శాకాంబరీ అవతారంలో ప్రత్యేక అలంకరణతో దర్శనం చేసుకోవడం వల్ల అందరికీ మంచి జరుగుతుందని అన్నారు. అమ్మవారు భక్తులకు ఆయురారోగ్యం, ఐశ్వర్యాలను ప్రసాదిస్తారని ఆయన తెలిపారు.పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు దర్శనం ప్రారంభించగా, తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు.

 

Breaking News

Subscribe our Newsletter