ఎస్.పి. బాలసుబ్రమణ్యం కి ఘన నివాళి..

ఎస్.పి. బాలసుబ్రమణ్యం కి ఘన నివాళి..

26/September/2026 12:24    Share:   

​యలమంచిలి :
గాన గంధర్వుడు, పద్మభూషణ్ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం 6వ వర్ధంతి కార్యక్రమాన్ని యలమంచిలి పట్టణంలో శుక్రవారం నిర్వహించారు. స్థానిక స్వరఝరి సంగీత సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మత్తుర్తి రామారావు ఆధ్వర్యంలో ఆయన నివాసంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ​ఈ సందర్భంగా బాలు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారతీయ సంగీత రంగానికి ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం అందించిన సేవలను, ఆయన తీపి జ్ఞాపకాలను నిర్వాహకులు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ​ఈ కార్యక్రమంలో ప్రముఖులు భీముని సత్యనారాయణ, శెలంశెట్టి ప్రకాష్, యల్లపు పైడికొండ, అబ్దుల్లా మాష్టారు, ఆవుపాటి సుబ్బారావు, మత్తుర్తి సాయికుమార్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
Breaking News

Subscribe our Newsletter