పెండింగ్‌లో ఉన్న యానాద్రి కాలువ నిర్మాణ పనులకు శంకుస్థాపన ..

పెండింగ్‌లో ఉన్న యానాద్రి కాలువ నిర్మాణ పనులకు శంకుస్థాపన ..

20/September/2026 06:17    Share:   

 క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ (స్పెషల్ రిపోర్టర్ )

యలమంచిలి శాసనసభ్యులు  సుందరపు విజయకుమార్ సూచనల మేరకు యలమంచిలి మున్సిపాలిటీ 12వ వార్డులో పెండింగ్‌లో ఉన్న యానాద్రి కాలువ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం శనివారం నిర్వహించారు.
కాలువ నిర్మాణం పూర్తయితే 12వ వార్డు పరిధిలోని ప్రజలకు డ్రైనేజీ సమస్యలు కొంతమేర పరిష్కారం కానున్నాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న పనులకు శంకుస్థాపన జరగడంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎలమంచిలి పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు బొద్ధపు శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గొర్ల నానాజీ, జనసేన పార్టీ వీర మహిళ కర్రి ఝాన్సీ, జనసేన పార్టీ నాయకులు, 12వ వార్డు ఇన్‌చార్జ్, ప్రభుత్వ ఆసుపత్రి డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులు గుర్రాల శేఖర్, జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి కోటారి నరేష్ పాల్గొన్నారు.
అలాగే బీజేపీ నాయకులు నక్క శివశంకర్, ఊట సతీష్, లంక రాజు, చిట్టిబాబు, సాయిబాబా మాస్టర్, పల్లా సత్యనారాయణ తదితర కూటమి నాయకులు, స్థానిక మహిళలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
మున్సిపాలిటీ అధికారులు కమిషనర్ ప్రసాద్ రాజు, ఏఈ నానాజీ, డీఈతో పాటు కాంట్రాక్టర్ రాజాన కృష్ణ తదితరులు హాజరయ్యారు.
కాలువ నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరారు.
Breaking News

Subscribe our Newsletter