స్టేషన్ రోడ్  ఉన్నత పాఠశాలలో ఘనంగా హిందీ దినోత్సవం .

స్టేషన్ రోడ్ ఉన్నత పాఠశాలలో ఘనంగా హిందీ దినోత్సవం .

18/September/2026 10:50    Share:   

యలమంచిలి : పట్నంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రైల్వే స్టేషన్ రోడ్డులో హిందీ బాసోత్సవాల్లో భాగంగా గురువారం హిందీ దినోత్సవాన్ని హిందీ ఉపాధ్యాయురాలు ఎస్ వి ఎన్ ఎస్ వరలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. పిల్లలకు హిందీ భాష పై ఉన్న మక్కువ తో హిందీ భాషలో గీతాలు, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ ఎన్ ఎల్ డి భవాని మాట్లాడుతూ విద్యార్థులందరూ మనదేశ రాజభాష హిందీ భాషను తప్పనిసరిగా నేర్చుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లిపాటి సత్యనారాయణ, డివి భారతి, కే రాజేష్, జిఎస్ కామేశ్వరి, టీ ఇందిరా రాణి, బి నరేంద్ర, వై భాస్కరరావు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
Breaking News

Subscribe our Newsletter