అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

17/September/2026 18:33    Share:   

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ హెచ్చరిక 
​రౌడీ షీటర్లపై నిరంతర నిఘా, రాత్రి వేళల్లో పకడ్బందీగా గస్తీ నిర్వహించాలి 
మహిళల భద్రత, సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి 
​ 
అనకాపల్లి పట్టణం, సెప్టెంబర్ 17:
అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులు, రిసెప్షన్ కౌంటర్, లాకప్ గదులను పరిశీలించిన ఎస్పీ, పెండింగ్ కేసుల పురోగతి మరియు స్టేషన్ నిర్వహణ తీరుపై అధికారులతో సమీక్షించారు.​ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు రౌడీ షీటర్లపై కఠిన నిఘా: పట్టణ పరిధిలోని రౌడీ షీటర్లు, పాత నేరస్థుల కదలికలపై నిరంతరం కన్నేసి ఉంచాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.పగలు, రాత్రి గస్తీ (బీట్ సిస్టమ్): రద్దీ ప్రాంతాలు, సున్నితమైన ప్రాంతాల్లో విజిబుల్ పోలీసింగ్ పెంచాలని, రాత్రి వేళల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేసి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని ఆదేశించారు.సీసీటీవీ కెమెరాల నిఘా: పట్టణంలోని ప్రధాన కూడళ్లు, వీధుల్లో నిఘా నేత్రాలను మరింత బలోపేతం చేయాలని, వ్యాపార సంస్థలు మరియు కాలనీల్లోనూ సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.​ 
మహిళా భద్రత & శక్తి యాప్: మహిళలు, యువతుల రక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి యాప్ వినియోగంపై విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించాలి. మహిళా చట్టాలపై ప్రతి ఒక్కరికీ స్పష్టత ఉండేలా చూడాలని పేర్కొన్నారు.​ 
సైబర్ నేరాలపై చైతన్యం: రోజురోజుకూ పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని, సైబర్ ఫిర్యాదులు రాగానే తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కారం: స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించి ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
​ఈ కార్యక్రమంలో అనకాపల్లి టౌన్ సీఐ జి.ప్రేమ కుమార్, ఎస్సైలు షేక్ జిలాని, వెంకటేశ్వరరావు, భాస్కరరావు మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter