స్వచ్ఛ పదంతో ఏటికొప్పాకలో పరిశుభ్రతకు శ్రీకారం..!

స్వచ్ఛ పదంతో ఏటికొప్పాకలో పరిశుభ్రతకు శ్రీకారం..!

17/September/2026 07:28    Share:   

ఎలమంచిలి : CA న్యూస్ రిపోర్టర్ ఆనంద్ 

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ఆదేశాల మేరకు మండలంలో ప్రతి బుధవారం స్వచ్ఛ పదం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఏటికొప్పాక గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టారు. గ్రామంలోని ప్రధాన రహదారులు, వీధులకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్తాచెదారం, వ్యర్థాలను పారిశుద్ధ్య కార్మికులు తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పారిశుద్ధ్య కార్మికులను ఒక బృందంగా ఏర్పాటు చేసి ప్రతి బుధవారం ఒక్కో గ్రామంలో స్వచ్ఛ పదం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కె. గిరిప్రసాదరావు, పంచాయతీ సిబ్బంది, వివిధ గ్రామాల నుంచి వచ్చిన శానిటేషన్ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు కూడా స్వచ్ఛత కార్యక్రమానికి సహకరించాలని కోరారు.
Breaking News

Subscribe our Newsletter