ప్రగడ నాగేశ్వరరావు  పర్యటన ఇంటింటికీ తెలుగుదేశం

ప్రగడ నాగేశ్వరరావు  పర్యటన ఇంటింటికీ తెలుగుదేశం' విజయవంతం చేయాలని పిలుపు

13/September/2026 20:11    Share:   

యలమంచిలి
నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ( ఏపీ ఆర్ డి సి) చైర్మన్  ప్రగడ నాగేశ్వరరావు ఈరోజు  ఆదివారం ఉదయం 10 గంటలకు యలమంచిలి టౌన్ పరిధిలోని 4వ వార్డు తెరువుపల్లి గ్రామంలో విస్తృతంగా పర్యటించారు.
​ఈ పర్యటనలో భాగంగా ఆయన వార్డులోని వీధి వీధినా తిరుగుతూ స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు మరియు ఇతర మౌలిక వసతుల సమస్యలపై వివరాలు సేకరించి, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
​అనంతరం ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో  ప్రగడ నాగేశ్వరరావు  మాట్లాడుతూ
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసేలా నాయకులు, కార్యకర్తలు రాత్రింబవళ్లు శ్రమించాలని, ప్రతీ వార్డులో పార్టీని మరింత బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు.
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటీకీ తీసుకెళ్లేలా 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమాన్ని అత్యంత విజయవంతం చేయాలని కోరారు.
టౌన్ ప్రెసిడెంటు నానాజీ  మాట్లాడుతూ మొదటి నుండి కష్టపడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలని మన పార్టీ వెన్నుదన్నుగా ఉండి అన్ని విధాల సహకరిస్తుందని తెలిపారు.
నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి కష్టసుఖాల్లో భాగస్వాములు కావాలని స్పష్టం చేశారు. 
ఈ కార్యక్రమంలో మాజీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ కొటారు. సాంబ, ప్రధాన కార్యదర్శి ఆడారి ఆదిమూర్తి , అధికార ప్రతినిధి దాడి. రమేష్ , క్లస్టర్ బుద్ధపు శ్రీనివాసరావు , ఆర్ఎస్ నాగేశ్వరరావు, పిల్ల. సత్యనారాయణ, పిల్ల. గంగాధర్, తుమ్మలపాల గంగాధర్, దంట్ల. వెంకటస్వామి, నమ్మి. రమణ, గల్లా.నూక నాయుడు, గేదెల. అప్పలనాయుడు, తుమ్మపాల కోటిపల్లి నాయుడు మరియు స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter