విజయనగరం: విజయనగరం జిల్లా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బెల్లాన చంద్రశేఖర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. నూతన జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బెల్లాన చంద్రశేఖర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బెల్లాన చంద్రశేఖర్‌కు అభినందనలు తెలిపారు. పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని సూచించారు.
బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో వైఎస్సార్‌సీపీని జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
క్రైమ్ ఎనాలసిస్ విజయనగరం జిల్లా ఇంచార్జ్ మందపాటి సూర్యనారాయణ రాజు