బాల్య వివాహాలు, సైబర్ మోసాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు .

బాల్య వివాహాలు, సైబర్ మోసాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు .

11/September/2026 16:36    Share:   

ఎస్.రాయవరం, సెప్టెంబర్ 10: 
​అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ పోతిరెడ్డి శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో ఎస్.రాయవరం మండల పరిధిలోని పెద్ద ఉప్పలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నక్కపల్లి సీఐ  రామకృష్ణ, ఎస్.రాయవరం ఎస్సై రమేష్ పాల్గొని విద్యార్థులకు పలు చట్టాలు, ప్రస్తుత సామాజిక సమస్యలపై దిశానిర్దేశం చేశారు.
బాల్య వివాహాల నిరోధం: బాల్య వివాహాల వల్ల ఎదురయ్యే శారీరక, మానసిక సమస్యలు, బాల్య వివాహ నిషేధ చట్టం–2006 ప్రకారం విధించే కఠిన శిక్షల గురించి అవగాహన కల్పించారు.​ సైబర్ నేరాలు – సోషల్ మీడియా ప్రభావం: ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల వినియోగంపై అప్రమత్తత అవసరమని తెలిపారు. ఆన్‌లైన్ గేమింగ్, మోసపూరిత లింకులు, లోన్ యాప్‌ల ఉచ్చులో పడకుండా జాగ్రత్త వహించాలని హెచ్చరించారు.​ సమాజంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి క్రమశిక్షణ, సత్ప్రవర్తన ఎంతగానో తోడ్పడతాయని, విద్యార్థులు తమ సమయాన్ని చదువు, ఉజ్వల భవిష్యత్తు కోసం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.​ఏదైనా సైబర్ మోసం లేదా ఆపద ఎదురైతే వెంటనే టోల్‌ఫ్రీ నంబర్లు 1930 లేదా 112కు ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు సూచించారు.
Breaking News

Subscribe our Newsletter