అనకాపల్లిలో ప్రమాదం: అభయ ఆంజనేయ స్వామి గుడిపై పడిన భారీ వృక్షం..

అనకాపల్లిలో ప్రమాదం: అభయ ఆంజనేయ స్వామి గుడిపై పడిన భారీ వృక్షం..

11/September/2026 16:24    Share:   

అనకాపల్లి (గవరపాలెం):
అనకాపల్లి గవరపాలెం పార్కును ఆనుకుని ఉన్న ప్రముఖ అభయ ఆంజనేయ స్వామి ఆలయంపై ఒక భారీ వృక్షం కూలిపడింది. ఈ ప్రమాదంలో ఆలయ పైభాగం పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం. వృక్షం ఒక్కసారిగా విరిగిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమయంలో ఆలయ పరిసరాల్లో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పింది. ప్రహరీ గోడ, ఆలయ కట్టడం కొంతమేర దెబ్బతిన్నాయి.
ఈ ఘటనతో ఆలయ పరిసరాల్లో పాత, బలహీన వృక్షాలను గుర్తించి తొలగించాలని స్థానిక భక్తులు, ప్రజలు అధికారులను కోరుతున్నారు. ఆలయ పునరుద్ధరణ చర్యలు త్వరితగతిన చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
పరిసర ప్రాంతాల్లో భారీ వృక్షాల భద్రతపై స్థానిక అధికారులు సర్వే నిర్వహించి, అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Breaking News

Subscribe our Newsletter