యలమంచిలి, సెప్టెంబర్ 14 – CA న్యూస్ రిపోర్టర్ ఆనంద్:
ఏటికొప్పాక గ్రామంలో ఎలమంచిలి రూరల్ ఎస్సై ఉపేంద్ర ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో నేరుగా మమేకమై గ్రామంలోని శాంతిభద్రతలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియకు సహకరించాలని కోరారు. యువత చెడు వ్యసనాలకు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎస్సై ఉపేంద్ర సూచించారు. గ్రామంలో అనుమానాస్పద కార్యకలాపాలు లేదా సమస్యలు కనిపిస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని. ప్రజల భద్రతకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు, యువకులు పాల్గొన్నారు. ఎస్సై ఉపేంద్రతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొని ప్రజలకు పలు సూచనలు చేశారు.