స్మార్ట్ మీటర్ల బిగింపును తక్షణమే నిలిపివేయాలి,పౌర సంక్షేమ సంఘం

స్మార్ట్ మీటర్ల బిగింపును తక్షణమే నిలిపివేయాలి,పౌర సంక్షేమ సంఘం

08/September/2026 19:37    Share:   

అనకాపల్లి,
విద్యుత్ వినియోగదారులపై ఒత్తిడి, బెదిరింపులకు పాల్పడి స్మార్ట్ మీటర్లను బిగించడం తక్షణమే నిలిపివేయాలని అనకాపల్లి పట్టణ పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం సంఘం ఆధ్వర్యంలో APEPDCL అనకాపల్లి సూపరింటెండెంట్ ఇంజనీర్, కార్యనిర్వహణ ఇంజనీర్‌లను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ అదానీ స్మార్ట్ మీటర్ల బిగింపును తక్షణమే నిలుపుదల చేయాలని, వినియోగదారులపై వివిధ పేర్లతో మోపుతున్న అదనపు చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ విధానాలను విడనాడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సంఘం కన్వీనర్ బి. ఉమామహేశ్వరరావు, కో-కన్వీనర్ పెంటకోట శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బొడ్డేడ అప్పారావు, కాళ్ల తాలయ్యబాబు, మద్దిల అప్పారావు, జె. రమేష్‌బాబు, గంటా శ్రీరామ్, పెంటకోట జగన్నాథం, అల్లు రాజు తదితరులు పాల్గొన్నారు.
క్రైమ్ ఎనాలసిస్ జిల్లా ఇంచార్జ్ శ్రీనివాస్ అప్పికొండ
Breaking News

Subscribe our Newsletter