ద్విచక్ర వాహనాల దొంగతనానికి పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్ - రెండు మోటార్ సైకిళ్ల స్వాధీనం.

ద్విచక్ర వాహనాల దొంగతనానికి పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్ - రెండు మోటార్ సైకిళ్ల స్వాధీనం.

16/March/2026 19:35    Share:   

అనకాపల్లి : .. విశ్వసనీయ సమాచారం మేరకు, ఈరోజు ఉదయం సుమారు 11:00 గంటల సమయంలో అనకాపల్లి పట్టణం, కొత్తూరు బ్రిడ్జి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు అనకాపల్లి మరియు గోలుగొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు.నిందితుడిపై గతంలో ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలోని గుండాల పి.ఎస్ లో మూడు దొంగతనాల కేసులు, రావులపాలెం మరియు గోలుగొండ పి.ఎస్ లలో ఒక్కో కేసు నమోదై ఉన్నాయి. తాజా కేసుతో కలిపి మొత్తం 6 కేసులు ఇతనిపై ఉన్నాయి.స్వాధీనం చేసుకున్న సొత్తు: బజాజ్ పల్సర్ 220 (నెంబర్: AP 39 SF 4993) - బ్లాక్ & రెడ్ కలర్.బజాజ్ పల్సర్ (నెంబర్: AP 39 SU 5564) - బ్లాక్ కలర్.
ఈ ఆపరేషన్‌లో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్న ఎస్.ఐ K. సంతోష్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ B. రామకృష్ణ (HC-1376), కానిస్టేబుళ్లు M. సముద్రం (PC-2178), RP నాయుడు (PC-2291), మరియు K. శ్రీకాంత్ (PC-2195) లను ఉన్నతాధికారులు అభినందించారు.
 
Breaking News

Subscribe our Newsletter