కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్,ఏలూరు,
విస్తరిస్తున్న నగరాల్లో అగ్నిమాపక శాఖా సేవలకు మరింత గుర్తింపునివ్వడంతో పాటూ, అత్యవసర వేళల్లో సత్వర సేవలను అందించేందుకు అవసరమైన శక్తియుక్తులను పెంచుతున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు.ఇదేంతో శుభపరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. జిల్లా కేంద్రమైన ఏలూరులోని అగ్నిమాపక కేంద్రానికి 15వ ఆర్ధిక సంఘం నిధులు 80లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన నూతన వాటర్ బ్రౌజర్‌ను టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. తొలుత ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు ఘన స్వాగతం లభించింది. అనంతరం జెండాఊపి వాహనాన్ని ప్రారంభించారు. అలాగే హోస్ బెడ్ వైపు రిబ్బన్ కట్ చేశారు. స్వయంగా వాహనాన్ని ఆన్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలను కాపాడేందుకు అవసరమైన చర్యలను ముమ్మరం చేస్తూ వచ్చినట్లు చెప్పారు. దానిలో భాగంగానే ఏ పనులకు మంజూరైన నిధులను ఆ పనులను పూర్తిచేసేందుకే కేటాయిస్తూ పారదర్శక విధానాలను అవలంభిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఏలూరు జిల్లాలో మొత్తం 6 అగ్నిమాపక శాఖా కేంద్రాలు ఉన్నాయని, ఏలూరులోని కేంద్రంలో ఇప్పటికే రెండు అగ్నిమాపక వాహనాలు ఉన్నాయని చెప్పారు. అత్యవసర వేళల్లో ప్రజలకు సత్వరమే సేవలను అందించేందుకు 15వ ఆర్ధిక సంఘం నిధులు 80లక్షల రూపాయలతో మరొక వాహనాన్ని కొనుగోలు చేసి అందుబాటులో ఉంచామని పేర్కొన్న ఎమ్మెల్యే బడేటి చంటి,,, తద్వారా ఎక్కడా అంతరాయాలు లేకుండా అత్యవసర సేవలు అందించేందుకు ఆస్కారాలు పెంచుతూ వస్తున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఫైర్ ఆఫీసర్ ఏవి శంకరరావు, అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ వి. రామకృష్ణ, టీడీపీ నాయకులు ఆర్‌ఎన్‌ఆర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు....