ప్రజల సమస్యలను త్వరితగతిన, పారదర్శకంగా పరిష్కరించడమే మా లక్ష్యం అని ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ వారు వెల్లడి..
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు
ప్రజల సమస్యలను వేగంగా, నిష్పక్షపాతంగా పరిష్కరించడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని ఏలూరు జిల్లా ఎస్పీ గారు పేర్కొన్నారు.
ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ ప్రజల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ గారు, అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీ వై. ప్రసాద్ రావు గారితో కలిసి జిల్లా నలు మూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులను నేరుగా కలుసుకుని వారి అర్జీలను స్వీకరించారు.
అధికారులు ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా విని, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని పూర్తిగా పేపర్‌లెస్ విధానంలో, ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ పారదర్శకమైన ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారా నిర్వహించారు.
ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 48 ఫిర్యాదులు అందాయి. వీటిలో ప్రధానంగా భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, ఆర్థిక మోసాలు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి.
ప్రతి ఫిర్యాదుపై చట్టప్రకారం నిష్పక్షపాత విచారణ చేపట్టి, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారు సంబంధిత పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
విచారణ నివేదికలను నిర్ణీత గడువులో సమర్పించాలని సూచించారు.
ప్రజల సౌకర్యార్థం ఎస్పీ గారి సూచనలు
దూర ప్రాంతాల నుంచి ప్రజలు జిల్లా పోలీసు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా, తమ సమీపంలోని సబ్-డివిజన్ లేదా సర్కిల్ కార్యాలయాల్లోనే ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని ఎస్పీ గారు తెలిపారు.
అలాగే ఇంటర్నెట్ సదుపాయం ఉన్నవారు Meekosam పోర్టల్ ద్వారా తమ ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని సూచించారు.
ప్రజలు తమ ఫిర్యాదుల స్థితిగతులు, పురోగతిని తెలుసుకోవడానికి 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కూడా సమాచారం పొందవచ్చని వివరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ వారు మాట్లాడుతూ, జిల్లా పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ప్రతి ఫిర్యాదును పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారించి, బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకుంటాం. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం మా బాధ్యత అని స్పష్టం చేశారు.