ఏలూరు జిల్లా సైబర్ సెల్ పోలీస్ స్టేషన్ నూతన భవన ప్రారంభించిన ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారు
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు
ఏలూరు జిల్లా సైబర్ సెల్ పోలీస్ స్టేషన్‌ను నూతన భవనంలోకి మార్చి, ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ గారు ఈ రోజు 28.08.2026 ప్రారంభించారు.
సైబర్ నేరాల నియంత్రణ, దర్యాప్తు మరియు బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు సైబర్ సెల్ పోలీస్ స్టేషన్‌ను నూతన భవనంలో ఏర్పాటు చేశారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ సైబర్ నేరాలపై సమర్థవంతంగా దర్యాప్తు చేపట్టాలని ఎస్పీ గారు అధికారులకు సూచించారు.
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని ఆర్థికంగా నష్టపోయిన బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
బాధితులు పోగొట్టుకున్న నగదు, ఆస్తి మరియు ఇతర విలువైన సొత్తును వీలైనంత త్వరగా ట్రేస్ చేసి, రికవరీ చేసి బాధితులకు తిరిగి అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
సైబర్ మోసాలు జరిగిన వెంటనే బాధితులు ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని, తద్వారా మోసపోయిన నగదును త్వరగా నిలుపుదల చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.
ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
బ్యాంక్ ఖాతా వివరాలు, OTPలు, ATM/డెబిట్ కార్డు వివరాలు, పాస్‌వర్డ్‌లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దని ప్రజలకు సూచించారు.
సోషల్ మీడియా, ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, నకిలీ లింకులు, పెట్టుబడి మోసాలు, ఉద్యోగాల పేరుతో జరిగే సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
సైబర్ నేరాలపై అందిన ఫిర్యాదులను సాంకేతిక ఆధారాలతో సమగ్రంగా పరిశీలించి, నేరస్థులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సైబర్ సెల్ సిబ్బందికి ఆదేశించారు.
సైబర్ నేరాలకు గురైన బాధితులకు సత్వర సహాయం అందించడం, వారు కోల్పోయిన సొత్తును వీలైనంత త్వరగా రికవరీ చేసి వారికి న్యాయం చేయడమే పోలీసుల ప్రధాన లక్ష్యం” అని ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ గారు పేర్కొన్నారు.
అనంతరం సి సి ఎస్ పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని స్టేషన్ను పరిశీలన చేసిన ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారు
ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీ వై ప్రసాద్ రావు గారు ఏలూరు డీఎస్పీ శ్రీ డి శ్రావణ్ కుమార్ గారు ఎస్ బి ఇన్స్పెక్టర్ మల్లేశ్వర రావు గారు సైబర్ సెల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దాసు గారు ఏలూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ కె రామ కృష్ణ గారు ఏలూరు 2 టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ అశోక్ కుమార్ గారు ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ కోటేశ్వర రావు గారు ఏలూరు సి సి ఎస్ ఇన్స్పెక్టర్ శ్రీ వెంకటేశ్వర రావు గారు ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు గారు, ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు గారు ఏలూరు పోలీస్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ శ్రీ అఖిల్ జమా గారు పెదవేగి ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజశేఖర్ గారు ఏలూరు 1 టౌన్ ఎస్ఐ సుధాకర్ రామ కృష్ణ గారు ఏలూరు 2 టౌన్ ఎస్ఐ రామ కృష్ణ పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు సంబంధిత పోలీసు అధికారులు పాల్గొన్నారు.