జులై 13లోగా BLOలకు ఓటర్ల వివరాలు సమర్పించాలి,మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రావు!
12/July/2026 22:31
Share:
జులై 13లోగా రాంనగర్ రామాలయం వద్ద BLOలకు ఓటర్ల వివరాలు సమర్పించాలి..!- మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రావు..!!
క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ : ఎలమంచిలి.. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ–2027 (SIR) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, పరిశీలన, డిజిటలైజేషన్ ప్రక్రియను జూలై 13లోగా పూర్తి చేయాల్సి ఉందని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రావు తెలిపారు.ఆదివారం యలమంచిలి పట్టణంలోని రాంనగర్ రామాలయం వద్ద బీఎల్‌వోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల సమాచారాన్ని త్వరితగతిన డిజిటలైజ్ చేయాలని సూచించారు.మరణించినవారు, శాశ్వతంగా వలస వెళ్లినవారు లేదా ప్రస్తుతం అందుబాటులో లేని ఓటర్ల వివరాలను వెంటనే గుర్తించి నమోదు చేయాలని తెలిపారు. అలాగే ప్రజలు తీసుకున్న SIR ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తిగా నింపి అవసరమైన వివరాలతో జూలై 13 సాయంత్రంలోగా రాంనగర్ రామాలయం వద్ద సంబంధిత BLOలకు సమర్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొటార్ శ్రీనివాస్ మాస్టర్, లంక ఉదయ్ కుమార్, శ్రీమంతుల శ్రీనివాస్, పడాల చంద్రరావు, పడాల నాని, గుర్రం నానాజీ, బొద్దపు రమణ, సచివాలయ సిబ్బంది లావణ్య, వీరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.