కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు
ఏలూరు టూ టౌన్ పోలీస్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ K. అశోక్ కుమార్ గారు శక్తి టీం సభ్యులు శక్తి యాప్ యొక్క ఉపయోగాలు, సైబర్ నేరాలు, గురించి ఏలూరు పాఠశాలలో విద్యార్థినీ లకు అవగాహన నిర్వహించారు.
ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని, లక్ష్మీవారపుపేటలో ఉన్న ARDGK మున్సిపల్ హైస్కూల్లో గురువారం ఉదయం విద్యార్థినీ విద్యార్థులకు సైబర్ నేరాలు శక్తి యాప్ ఉపయోగాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు టూ టౌన్ మహిళా ఎస్ఐ నాగ కళ్యాణి గారు హాజరయ్యారు.ఈ సందర్భంగా నాగ కళ్యాణి గారు మాట్లాడుతూ శక్తి యాప్ మహిళా భద్రతకు సంబంధించిన అత్యవసర స్పందన మొబైల్ అప్లికేషన్. దీనిని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అభివృద్ధి చేసిందని, ఇది ముఖ్యంగా మహిళలు, బాలికలకు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించేందుకు రూపొందించబడింది అని చెప్పారు.ఏది అయినా అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్ను ఉపయోగించిన ఎడల లేదా డయల్ 112 కు సమాచారం అందించిన ఎడలసమీప శక్తి టీం గస్తీ బృందం తక్షణమే మీ వద్దకు చేరుకోగలరాని చెప్పారు.
మహిళా రక్షణపై నమ్మకమైన సాధనం ఈ యాప్ ద్వారా మహిళలు రాత్రి పూట లేదా ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు భద్రతగా ఉంటుందన్నారు..
శక్తి యాప్ లో మహిళల హక్కులు, చట్టాలు, పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ లు మొదలైన సమాచారం లభిస్తుందని విద్యార్థిని విద్యార్థులకు అర్థమయ్యే చెప్పటం జరిగింది.
సైబర్ నేరాలు, వేధింపులు వంటి వాటి గురించి కూడా అవగాహన కల్పించారు హెల్ప్ లైన్ నెంబర్ లను అందుబాటులో 24 గంటలు అందుబాటులో ఉంటాయని చెప్పారు
112 – ఎమర్జెన్సీ నెంబర్
మహిళా హెల్ప్ లైన్ వంటి నెంబర్లను నేరుగా యాప్ నుండి కాల్ చేయవచ్చని అన్నారు
ఫ్రెండ్ ట్రాకింగ్ / సేఫ్టీ షేరింగ్. మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో లైవ్ లొకేషన్ ను పంచుకోవచ్చు వారు మీ ప్రయాణాన్ని గమనించవచ్చని తెలిపారు.
శక్తి యాప్ ను ఉపయోగించ వలసిన సందర్భాలపై చెప్పారు ... ముఖ్యంగా... వేధింపులు, కిడ్నాప్ ప్రయత్నం,గృహ హింస,రహదారిలో ఒంటరిగా ప్రయాణం,అనుమానాస్పద వ్యక్తుల ప్రవర్తనపై శక్తి యాప్ ఒక ఆత్మ విశ్వాసానికి కలిగి ఉంటాడడానికి నిదర్శనమన్నారు.
మహిళలు ఎక్కడ ఉన్నా సురక్షితంగా ఉండేందుకు పోలీస్ శాఖ తీసుకున్న అద్భుతమైన చర్య. ప్రతి మహిళా తమ ఫోన్ లో ఈ యాప్ తప్పనిసరిగా ఉంచుకోవాలి అని ఎస్సై నాగ కళ్యాణి గారు విద్యార్థులకు తెలియ చేసినారు.అదేవిధంగా సైబర్ నేరాలు ప్రస్తుతం ఎక్కువ అయ్యాయని, ఈ విషయాన్ని ప్రతి విద్యార్థి, విద్యార్థులు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. మీ మొబైల్ లకు అన్నోన్ నెంబర్ల నుంచి లింకులు రావడం అప్పుడు పరిపాటిగా మారిందని ఆ లింకులు ఓపెన్ చేసిన ఎడల మన బ్యాంక్ అకౌంట్ లను హ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా ఫోన్లో అనుమానిత వ్యక్తులు ఎవరైనా డింకులు గానీ మెసేజ్లు గాని పంపించిన ఎడల వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయవద్దని ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులకు మీ బంధుమిత్రులకు వివరించాలని చెప్పారు.