సీఎంఆర్ఎఫ్ ద్వారా గల్లా లక్ష్మి కుటుంబానికి రూ.33,000 ఆర్థిక సహాయం మంజూరు..

సీఎంఆర్ఎఫ్ ద్వారా గల్లా లక్ష్మి కుటుంబానికి రూ.33,000 ఆర్థిక సహాయం మంజూరు..

25/August/2026 20:53    Share:   

* జనసేన పార్టీ సానుభూతిపరురాలి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.33,000 రూపాయల  ఆర్థిక సహాయం
చోడవరం నియోజకవర్గం, రావికమతం మండలం కన్నంపేట గ్రామానికి చెందిన జనసేన పార్టీ సానుభూతిపరురాలు శ్రీమతి గల్లా లక్ష్మి ఇటీవల తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ఆర్థిక సహాయం అందించాలని ప్రతిపాదనలు  సమర్పించగా, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రూ.33,000 ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.33,000 చెక్కును గల్లా లక్ష్మి కుమారుడు శ్రీ గల్లా శ్రీనుకు జనసేన పార్టీ చోడవరం నియోజకవర్గ ఇంచార్జి శ్రీ పీవీఎస్ఎన్ రాజు గారు నేడు కొత్తకోటలోని తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
ఈ కార్యక్రమంలో రోలుగుంట మండల జనసేన పార్టీ అధ్యక్షులు బలిజి  మహారాజ్, కూటమి నాయకులు డి.రాజేష్, జనసేన పార్టీ నాయకులు చింతల కిషోర్, లోట్ల శివ, భీమరాతి ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter