ప్రకాశం పంతులు గారికి అనకాపల్లి జిల్లా పోలీసు వ్యవస్థ ఘన నివాళి.. 

ప్రకాశం పంతులు గారికి అనకాపల్లి జిల్లా పోలీసు వ్యవస్థ ఘన నివాళి.. 

23/August/2026 21:22    Share:   

ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారికి అనకాపల్లి జిల్లా పోలీసు వ్యవస్థ ఘన నివాళి 
అనకాపల్లి, ఆగస్టు 23: ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు 'ఆంధ్రకేసరి' శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి 155వ జయంతి వేడుకలు అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో భావపూర్వకంగా నిర్వహించబడ్డాయి.​ అనకాపల్లి సబ్ డివిజన్ ఇన్చార్జ్ డీఎస్పీ శ్రీ జీ.ఆర్.ఆర్.మోహన్ గారు టంగుటూరి ప్రకాశం పంతులు గారి చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు.
​ఈ సందర్భంగా ఇన్చార్జ్ డీఎస్పీ శ్రీ జీ.ఆర్.ఆర్.మోహన్ మాట్లాడుతూ: 
​మద్రాసులో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో, బ్రిటిష్ తుపాకీ ఎదుట గుండెను చూపి "కాల్చండి" అని గర్జించిన ప్రకాశం పంతులు ధైర్యసాహసాలు చరిత్రలో నిలిచిపోయాయని, ఆ సాహసమే ఆయనకు 'ఆంధ్రకేసరి' బిరుదును తెచ్చిపెట్టిందని గుర్తుచేశారు.నిజాయితీ, సత్యనిష్ఠ, నైతిక విలువలతో కూడిన ఆయన జీవితం నేటి యువతకు, ప్రజాప్రతినిధులకు మరియు ఉద్యోగస్వామ్యానికి దిశానిర్దేశమని పేర్కొన్నారు.టంగుటూరి ప్రకాశం పంతులు గారు వేసిన బాటలో పయనిస్తూ, రాష్ట్ర మరియు దేశ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు.
​ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ ఇన్చార్జ్ డీఎస్పీ గారితో పాటు కార్యాలయ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొని ఆంధ్రకేసరి చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
Breaking News

Subscribe our Newsletter