ఏటికొప్పాక హస్తకళాకారుల ఆరోగ్యానికి ప్రభుత్వ అండ,ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు..

ఏటికొప్పాక హస్తకళాకారుల ఆరోగ్యానికి ప్రభుత్వ అండ,ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు..

10/July/2026 17:18    Share:   

అనకాపల్లి జిల్లా,(క్రైమ్ న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఏటికొప్పాక  ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఏటికొప్పాక లక్కబొమ్మల హస్తకళాకారులు వృత్తి నిర్వహణలో ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఎలమంచిలి ఎమ్మెల్యే సుందర్ విజయ్ కుమార్ శిబిరాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.రోజువారీగా రంగులు, రసాయనాలు, చెక్క దుమ్ము మధ్య పనిచేసే హస్తకళాకారుల్లో చర్మవ్యాధులు, శ్వాసకోశ ఇబ్బందులు, కంటి సమస్యలు అధికంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరంలో హస్తకళాకారులతో పాటు గ్రామ ప్రజలు, చిన్నారులు, గర్భిణీలు,వృద్ధులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత మందులు పంపిణీ చేసి వైద్యుల సూచనలు అందించారు.కార్యక్రమ నిర్వహణలో ఎంపీడీఓ దీపిక, గ్రామ కార్యదర్శి గిరిప్రసాద్ సమన్వయం చేశారు. వైద్య బృందంలో డీఎంహెచ్‌ఓ ఎం. హేమావతి, డీపీఎంఓ ఆర్. వెంకటేష్, డా. సుగుణ, డా. మానస, సీహెచ్‌ఓ కృష్ణవేణి, సీహెచ్‌ఓ అమ్మాజీ, ఏఎన్‌ఎమ్ లక్ష్మి, ఆశా వర్కర్లు సేవలందించారు.

కూటమి నాయకుల్లో ఎంపీపీ రాజన్న సూర్యచంద్ర శేషగిరిరావు (శేషు), జనసేన మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్ అన్నం బాబ్జి, మాజీ సర్పంచ్ కాండ్రకోట చిరంజీవి, వైస్ ఎంపీపీ నగిరెడ్డి అచ్చయ్య నాయుడు, అన్నం స్వరాజీరావు, గొంతుమూర్తి కొండయ్య నాయుడు, కర్రి సింహాచలం, మాజీ సర్పంచ్ భజంత్రీల లక్ష్మీరాము, భజంత్రీల శ్రీను, కొత్తవల సతీష్ తదితరులు పాల్గొన్నారు.హస్తకళాకారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపడం అభినందనీయమని గ్రామ ప్రజలు, కళాకారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Breaking News

Subscribe our Newsletter