అనధికార బాణాసంచా తయారీ, నిల్వ, అమ్మకాలపై కఠిన చర్యలు: అనకాపల్లి జిల్లా ఎస్పీ

అనధికార బాణాసంచా తయారీ, నిల్వ, అమ్మకాలపై కఠిన చర్యలు: అనకాపల్లి జిల్లా ఎస్పీ

20/September/2026 21:07    Share:   

అనకాపల్లి, సెప్టెంబర్ 20:
జిల్లా వ్యాప్తంగా అనుమతి లేని బాణాసంచా తయారీ కేంద్రాలు, అక్రమ నిల్వలు మరియు విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే ధ్యేయంగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
​ 
పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు: 
ఆకస్మిక తనిఖీలు: జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు (SHOs) తమ పరిధిలోని బాణాసంచా తయారీ కేంద్రాలలో తక్షణమే ఆకస్మిక తనిఖీలు చేపట్టాలిని.అనుమతి పొందిన బాణాసంచా తయారీ కేంద్రాల భద్రతా ప్రమాణాలు పాటించాలిని: తయారీ కేంద్రాల్లో అగ్నిమాపక నివారణ పరికరాలు, నీరు, ఇసుక వంటి భద్రతా ఏర్పాట్లు నిబంధనల ప్రకారం ఉన్నాయో లేదో పరిశీలించాలిని.అనధికార యూనిట్ల గుర్తింపు: పరిధిలో ఎలాంటి అనుమతి లేని బాణాసంచా తయారీ లేదా నిల్వ కేంద్రాలు పనిచేయకుండా క్షేత్రస్థాయిలో విచారించి, సరిచూసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలిని.జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు.
బాణాసంచా తయారీదారులకు మరియు వ్యాపారులకు సూచనలు: 
​ప్రభుత్వ అనుమతి పొందిన ప్రదేశాలలో మాత్రమే నిర్ణీత పరిమితికి లోబడి తయారీ, నిల్వ జరపాలిని.
​మైనర్లను, నైపుణ్యం లేని వారిని పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరం. కేవలం శిక్షణ, అనుభవం ఉన్న వ్యక్తులతోనే పనులు చేయించాలిని.​నివాస ప్రాంతాలు, జనసమ్మర్థం ఉన్న ప్రదేశాలలో బాణాసంచా తయారీ లేదా భారీ నిల్వలు పూర్తిగా నిషేధం.
​తయారీ ప్రదేశాల వద్ద విద్యుత్ వైరింగ్ సురక్షితంగా ఉండాలిని; ఎలాంటి ధూమపానం లేదా మండే పదార్థాలను అనుమతించకూడదు.
ప్రజలకు జిల్లా ఎస్పీ విజ్ఞప్తి:
​మీ పరిసర ప్రాంతాలలో అనుమతి లేకుండా బాణాసంచా తయారు చేస్తున్నా, అక్రమంగా నిల్వ ఉంచినా లేదా నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. లేదా డయల్ 112 కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయి. ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించి ప్రమాదాల నివారణకు తోడ్పడాలని కోరడమైనది.
Breaking News

Subscribe our Newsletter