ఎలమంచిలిలో  స్వచ్ఛ్ ఆంధ్ర–స్వర్ణాంధ్ర..!

ఎలమంచిలిలో స్వచ్ఛ్ ఆంధ్ర–స్వర్ణాంధ్ర..!

22/August/2026 19:24    Share:   

స్వచ్ఛ్ ఆంధ్ర–స్వర్ణాంధ్రలో భాగంగా రాళ్లచెరువు వద్ద పరిశుభ్రత కార్యక్రమం

రిపోర్టర్ కన్నేపల్లి నాగ శ్రీనివాస శర్మ
ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించాల్సిన స్వచ్ఛ్ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమం ఆగస్టు నెల థీమ్ అయిన "శానిటేషన్ అండ్ క్లీన్ లెన్స్ యాక్టివిటీస్"లో భాగంగా ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక రాళ్లచెరువు వద్ద ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.
మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో చెరువు చుట్టూ ఉన్న తుప్పలను తొలగించి జంగిల్ క్లియరెన్స్ చేపట్టడంతో పాటు చెత్తను తొలగించారు.
మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెత్తను తడి, పొడి చెత్తగా విభజించి పారిశుద్ధ్య కార్మికునికి అందించాలని, చెత్తను కాలువల్లో గాని, రోడ్లపై గాని వేయకుండా బాధ్యతగా వ్యవహరిస్తూ స్వచ్ఛ ఎలమంచిలి సాధనకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ పల్లా శ్రీనివాసరావు, మున్సిపల్ మేనేజర్ విజయ్ కుమార్, మెప్మా సిబ్బంది, మున్సిపల్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter