దళితపేట సమస్యల పరిష్కరించాలని కోరుతూ 24  కలెక్టరేట్ ముట్టడి..

దళితపేట సమస్యల పరిష్కరించాలని కోరుతూ 24 కలెక్టరేట్ ముట్టడి..

21/August/2026 21:09    Share:   

కన్నేపల్లి నాగ శ్రీనివాస్ శర్మ (CA NEWS ప్రతినిధి)

కొండకర్ల 
సామాజిక శంఖారావం పేరుతో కొండకర్ల గ్రామంలో గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కె శ్రీనివాస మాట్లాడుతూ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 950 కోట్లు దళితుల గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేయాలని గ్రామాల్లో రోడ్లు కాలువలు డ్రైనేజీ మంచినీరు వంటి సౌకర్యాలు కల్పించి దళితుల స్మశాన వాటికలో సౌకర్యాలు కల్పించాలని అందరికీ ఉండడానికి ఇల్లు ఇంటి స్థలాలు కేటాయించాలని పై డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 24వ తేదీన సోమవారం కలెక్టరేట్ కి తరలిరావాలని కోరారు ఈ కార్యక్రమంలో జెవివి జిల్లా కార్యదర్శి మారిశెట్టి వెంకట అప్పారావు మాస్టారు ,జిల్లా కార్యదర్శి కె రామ సదాశివరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ రాము, అచ్చుతాపురం మండల కన్వీనర్ కె సోము నాయుడు, మత్స్య కార్మిక సంఘం నాయకులు ఎం రమణ ,గ్రామ ప్రజలు గుబ్బల అప్పారావు, రెల్లి అర్జున తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter