ఎలమంచిలి:
స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి జి. స్పందన హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె వైద్య సిబ్బందికి, వైద్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆసుపత్రిలోని వార్డులను సందర్శించి, రోగులతో నేరుగా మాట్లాడారు. ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు, అందుతున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఎల్లప్పుడూ మెరుగైన, నాణ్యమైన వైద్య సదుపాయాలను అందించాలని, బాధ్యతాయుతంగా సేవలందించాలని వైద్యులకు, సిబ్బందికి ఆమె తగు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ద్వారపురెడ్డి వెంకటరావు, ఆసుపత్రి వైద్యులు, పారామెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.