పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి,ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి..

పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి,ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి..

20/August/2026 20:33    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు, 
పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని సంకల్పంతో స్వచ్ఛతకు పెద్దపీట వేస్తున్నామని టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. దానిలో భాగంగానే ఆధునిక యంత్రాలను సైతం పారిశుధ్య నిర్వహణకు వినియోగిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఏలూరును స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి విశేషంగా శ్రమిస్తూ వస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పటికే రాత్రుళ్ళు ఒక స్వీపింగ్‌ మిషన్‌ ఎండ్‌ టూ ఎండ్‌ రోడ్లను శుభ్రం చేస్తూ వస్తోంది. ఇదేక్రమంలో బుధవారం ఏలూరులోని నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సుమారు 90లక్షల రూపాయల కార్పొరేషన్‌ నిధులతో కొనుగోలు చేసిన 3క్యూబిక్‌ మీటర్‌ స్వీపింగ్‌ మిషన్‌ను ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఆయనకు తొలుత ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం స్వీపింగ్‌ మిషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే బడేటి చంటి,,, 60 లీటర్ల డస్ట్‌బిన్‌లు 200, హ్యాండ్‌ మైక్‌లు 60, ఫోర్‌ బిన్‌ ట్రాలీలు 28, కంపాక్టర్‌ బిన్లు రెండింటిని పారిశుద్ద్య సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాధినేతలు ఇచ్చిన స్ఫూర్తిని అందిపుచ్చుకుని స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఆదర్శవంతంగా నియోజకవర్గంలో నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. తానుకూడా తొలినుండి పారిశుద్ధ్యానికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చానని చెప్పారు. దానిపై చూపిన ప్రత్యేక శ్రద్ధ కారణంగానే ఇప్పటికే కార్పొరేషన్‌ పరిధిలో ఆధునిక యంత్రాల సాయంతో పారిశుద్ధ్య నిర్వహణా పనులు వేగం పుంజుకున్నాయని వెల్లడించారు. ప్రజలు కూడా తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందజేసి పారిశుద్ధ్య సిబ్బందికి సంపూర్ణ సహకరం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. పారిశుద్ధ్యం నిర్వహణలో ఎక్కడైనా అసౌకర్యం కలిగితే ప్రజలు టోల్‌ ఫ్రీ నెంబర్‌ 89789 99955కు సమాచారం అందిస్తే సత్వర చర్యలు చేపడతామని ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్పొరేషన్‌ కమిషనర్ ఎ.భాను ప్రతాప్‌, అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావు, ఎంఈ సురేంద్రబాబు, ఎంహెచ్ఓ లక్ష్మీనారాయణ, ప్రాజెక్ట్ ఆఫీసర్ మహాలక్ష్మి, మేనేజర్ సిహెచ్ మూర్తి, ఏఈ రఫీ, డిఈ అప్పలరాజు, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, పార్టీ సీనియర్‌ నాయకులు బెల్లపుకొండ కిషోర్, మున్సిపల్ అధికారులు, శానిటేషన్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు...
Breaking News

Subscribe our Newsletter