జడ్పీ ఉన్నత పాఠశాలలో సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం..

జడ్పీ ఉన్నత పాఠశాలలో సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం..

20/August/2026 20:09    Share:   

యలమంచిలి: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రైల్వే స్టేషన్ రోడ్, యలమంచిలిలో వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ ధినయ్ కుమార్ (ఆయుర్వేద వైద్య నిపుణులు) మరియు డాక్టర్ ఎల్. రిషిత (హోమియో వైద్య నిపుణులు) పాల్గొన్నారు. వర్షాకాలంలో ప్రబలే వ్యాధులు, వాటి లక్షణాలు మరియు నివారణ చర్యలపై విద్యార్థులకు వివరంగా అవగాహన కల్పించారు.
అనంతరం హోమియో వైద్య నిపుణులు ప్రివెంటివ్ మెడిసిన్ (నివారణ మందులను) విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడు మల్లిపాటి సత్యనారాయణ, ఉపాధ్యాయులు డి.వి. భారతి, కె. రాజేష్, పి. శ్రీనివాసరావు, జి.ఎస్. కామేశ్వరి, టి. ఇందిరా రాణి, ఎస్వీఎన్ఎస్ వరలక్ష్మి, బి. నరేంద్ర మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter