"డాక్టర్ పద్మలత" ఇంటి ఇంటికి పశుగ్రాస సర్వే..

"డాక్టర్ పద్మలత" ఇంటి ఇంటికి పశుగ్రాస సర్వే..

19/August/2026 21:26    Share:   

అనకాపల్లి: అనకాపల్లి మండలం సత్యనారాయణపురం గ్రామంలో ప్రత్యేక అధికారి, AD, DAH డాక్టర్ పద్మలత ఇంటి ఇంటికి పశుగ్రాస సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక పాడి రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి పశుగ్రాస లభ్యత, అవసరాలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి తగిన సూచనలు అందించారు.ఎల్-నినో పరిస్థితుల నేపథ్యంలో పశువుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని డాక్టర్ పద్మలత సూచించారు. పశువులకు నీడ కల్పించాలని, తగినంత శుభ్రమైన నీరు, నాణ్యమైన పచ్చి పశుగ్రాసం అందించాలని తెలిపారు. అజోల్లా, మాగుడి గడ్డి తదితర పశుగ్రాసాలను వినియోగించాలని సూచించారు. పాకల్లో గాలి ప్రసరణ సరిగా ఉండేలా చూడాలని, పశుగ్రాస నిల్వలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో గవరపాలెం పశువైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్, AHA ఈశ్వర్, సాగర్, వెంకట్ పాల్గొన్నారు.

Breaking News

Subscribe our Newsletter