గోవిందపాలెం,రాంబిల్లి గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం..
14/July/2026 20:43
Share:
ఖరీఫ్ 2026 పొలం పిలుస్తుంది కార్యక్రమం ఈ రోజు గోవిందపాలెం మరియు రాంబిల్లి గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి సుమంత ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. క్షేత్ర పర్యటన చేసి PMDS ప్లాట్లను రైతుల సమక్షంలో పరిశీలించి పలు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అనంతరం కొబ్బరి సాగు లో మేలైన యాజమాన్య పద్ధతులు మరియు సస్యరక్షణ పై అవగాహన రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు ఆయా రైతు సేవా కేంద్రలలో అందుబాటులో ఉంచామని తెలిపారు.అనంతరం APAIMS యాప్ ద్వారా రైతులకి యూరియా అందజేశారు.ఖరీఫ్ లో సాగు చేస్తున్న పంటలను వ్యవసాయ సిబ్బంది ద్వారా ఈ పంట నమోదు చేసుకోవాల్సిందిగా కోరడమైంది.ఈ కార్యక్రమం లో రైతులు, AEO Demudu, VAA తేజస్విని , VHA అనిల్ కుమార్ , ప్రకృతి వ్యవసాయ సిబ్బంది- మహేష్, ధనలక్ష్మి, మహేశ్వరీ పాల్గొన్నారు.