విశాఖ ఎయిర్‌పోర్టు మూసివేతపై సీపీఎం ఆగ్రహం..!

విశాఖ ఎయిర్‌పోర్టు మూసివేతపై సీపీఎం ఆగ్రహం..!

17/August/2026 20:54    Share:   

విశాఖ ప్రజలకు ద్రోహం చేయొద్దు: సీపీఎం..!!

క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ :

విశాఖపట్నం ఎయిర్‌పోర్టును మూసివేసి విశాఖ ప్రజలకు తీవ్ర అన్యాయం చేయొద్దని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. 60 సంవత్సరాల చరిత్ర కలిగిన విశాఖ ఎయిర్‌పోర్టును మూసివేయాలన్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు.
సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం. జగన్నాయుడు మాట్లాడుతూ విశాఖ ఎయిర్‌పోర్టును శాశ్వతంగా కొనసాగించాలని, డొమెస్టిక్ ఎయిర్‌పోర్టు సేవలను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఎయిర్‌పోర్టు మూసివేత వల్ల విశాఖ ప్రజలు, వ్యాపారులు, ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు.విశాఖలో విమాన ప్రయాణికుల సంఖ్య ఏటా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఎయిర్‌పోర్టును కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. విశాఖ అభివృద్ధికి కీలకమైన విమానాశ్రయాన్ని మూసివేయడం వల్ల ప్రాంతీయ ఆర్థికాభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎయిర్‌పోర్టు కొనసాగింపుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఎయిర్‌పోర్టు మూసివేతకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని పి. పైడిరాజు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు తెలియజేసారు.
Breaking News

Subscribe our Newsletter