కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,
ఏలూరు,:
జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం 'ఎట్ హోమ్' కార్యక్రమం చక్కని ఆహ్లదకరం వాతావరణంలో జరిగింది. జిల్లా అధికారులు కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు. వారిని జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన నృత్య కార్యక్రమాలు, పాటల పోటీలు, మ్యూజిక్ ఛైర్స్, క్విజ్, అధికారుల దంపతులతో సరదాగా నిర్వహించిన కార్యక్రమాలు ఎంతో ఉల్లాసపరిచాయి. కార్యక్రమాలలో జిల్లా అధికారులు సరదాగా, ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. మహిళలకు, పురుషులకు విడివిడిగా మ్యూజిక్ చైర్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని అధికారులందరూ ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా పాల్గొన్నారు. చల్లని సాయంత్రం జరిగిన కార్యక్రమం ఆద్యంతం అధికారులలో జోష్ నింపింది.
కార్యక్రమంలో ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ట్రైనీ కలెక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి, డిఎఫ్ఓ సందీప్ రెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారి ఎం. శ్రీదేవి, జిల్లా పరిషత్ సీఈఓ జగదాంబ, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, డిపిఓ మల్లికార్జునరావు, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భాను ప్రతాప్, డిఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, డిఎంహెచ్ఓ డా.శోభ, సెట్ వెల్ సీఈఓ ప్రభాకర్, డిటిసి కరీం , వివిధ శాఖల అధికారులు, ప్రభృతులు పాల్గొన్నారు.