స్త్రీ శక్తికి ఏడాదికి రూ.3095 కోట్ల ఖర్చు..

స్త్రీ శక్తికి ఏడాదికి రూ.3095 కోట్ల ఖర్చు..

17/August/2026 09:27    Share:   

* ప్రతిరోజు సగటున 23.99 లక్షల మంది ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు..
* మీడియా సమావేశంలో ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, డిపిటివో షేక్ షబ్నం వెల్లడి..
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,
ఏలూరు, ఆగష్టు 
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించే స్త్రీ శక్తి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించి నేటితో ఏడాది పూర్తి ఐన సందర్భంగా ఈరోజు ఏలూరు డిపిటివో కార్యాలయం నందు ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారు, జిల్లా ప్రజా రవాణాధికారి షేక్ షబ్నం గారితో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు 87.09 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాలు చేసినట్లు వెల్లడించారు. ప్రతిరోజు సగటున 23.99 లక్షల మంది ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. ఈ స్త్రీ శక్తీ పథకం కోసం ఒక్కఏడాది కాలంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని ఆయన తెలిపారు. ఈ ఉచిత ప్రయాణం వల్ల కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గిందని, వైద్య సేవలు, అవసరమైన పనులు ఇతర కార్యక్రమాల కోసం స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం లభించిందని మహిళలు జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారికి వివరించారు. మహిళల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఆయన తెలిపారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రజలకు అందుబాటుగా అనేక సర్వీసుల్ని పెంచడం జరిగిందని, నేటితో కూటమి ప్రభుత్వం ఉచిత స్త్రీ బస్సు పథకం ప్రవేశపెట్టి సంవత్సరమైందని, ఈ ప్రయాణంలో కోట్లాదిమంది మహిళలు, ఉచిత ప్రయాణం చేసి, ధనాన్ని ఆదా చేశారని, తాను జోనల్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఈ జోన్ నందు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని, దానికి సంబంధించి ఆర్టీసీ అధికారులు, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్లు, ఏలూరు డి.పి.టి.ఓ శ్రీమతి షబ్నం గారు ఎంతగానో తనకు సహకరించారని, రానున్న రోజుల్లో కూడా ఇదేవిధంగా సమిష్టి కృషితో ఆర్టీసికీ సహాయ సహకారాలు అందిస్తానన్నారు. అరాచకాల రాజకీయాలకు చరమగీతం పాడాలన్నారు.. రాష్ట్రంలో ప్రతిపక్ష రాజకీయాలపై జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తీవ్ర విమర్శలు చేశారు.. అధికారంలోకి వస్తే హింసాత్మక చర్యలకు పాల్పడతామంటూ, అరాచకం వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్ నేతృత్వంలోని ప్రతిపక్ష రాజకీయాలు అరాచక ధోరణులకు దారి తీస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రజా రవాణా అధికారి శ్రీమతి షబ్నం గారు మాట్లాడుతూ మహిళలకి  స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టిన తర్వాత తమ సిబ్బంది అన్ని రకాల గాను, ఎంతో తోడ్పాటును అందించి, ప్రయాణికుల్ని గమ్యస్థానాలకి చేరుస్తున్నారని, సంస్థలోని డిపో మేనేజర్లు, మెకానికల్, సూపర్వైజర్లు, కండక్టర్ డ్రైవర్లు, సెక్యూరిటీ విభాగం వారు, మంచి సహాయ సహకారాలు అందిస్తూ, మంచి పేరు తీసుకొస్తున్నారని వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఏలూరు కొత్త బస్టాండ్ లో మహిళలతో మమేకమై స్త్రీ శక్తి పథకం ద్వారా వారికి అందుతున్న ప్రయోజనాలు, వారి అనుభవాలు ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మీడియా సమావేశంలో ఏలూరు డిపో మేనేజర్ బొంతు వాణి గారు తదితరులు పాల్గొన్నారు..
Breaking News

Subscribe our Newsletter