పేకాట స్థావరంపై పోలీసుల దాడి 12 మంది అరెస్ట్ రూ.22,880 నగదు స్వాధీనం

పేకాట స్థావరంపై పోలీసుల దాడి 12 మంది అరెస్ట్ రూ.22,880 నగదు స్వాధీనం

17/August/2026 09:25    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు.
స్థానికంగా అందిన ఎస్‌బీ సమాచారం మేరకు చర్యలు
స్థానిక దక్షిణపు వీధిలోని పాత వేరుశనగ ఫ్యాక్టరీ గ్రౌండ్‌లో పేకాట ఆడుతున్న వారిపై వన్‌టౌన్ పోలీసులు ఆదివారం దాడి నిర్వహించారు. ఎస్‌బీ సమాచారం మేరకు మధ్యాహ్నం సుమారు 1.30 గంటల సమయంలో పోలీసు సిబ్బంది ఈ దాడి చేపట్టారు.ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పేకాటకు వినియోగిస్తున్న రూ.22,880 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో వన్‌టౌన్ పోలీసు సిబ్బంది ప్రత్యేకంగా దాడి నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. స్వాధీనం చేసుకున్న నగదును సీజ్ చేసి, అదుపులోకి తీసుకున్న వారిపై నిబంధనల మేరకు కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టినట్లు సమాచారం.పేకాట, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వన్ టౌన్ సీఐ రామకృష్ణ  హెచ్చరించారు..    
ప్రజలు ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం అందిస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు పేర్కొన్నారు.
Breaking News

Subscribe our Newsletter